![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా 'లెజెండ్'కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాతోనే విలక్షణ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా సరికొత్త అవతారమెత్తారు. జితేంద్ర అనే పాత్రలో జీవించి.. జననీరాజనాలు అందుకున్నారు. 'లెజెండ్'తో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన జగ్గూభాయ్.. మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. అలా.. బాలయ్య కాంబో జగపతిబాబుకి ఎంతో మెమరబుల్ అనే చెప్పాలి.
కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత బాలయ్యతో మరోసారి కలిసి నటించబోతున్నారట జగ్గూభాయ్. అది కూడా.. 'లెజెండ్' దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలోనే కావడం విశేషం. అయితే, 'లెజెండ్'లో మాదిరిగా విలన్ గా కాకుండా.. ఇందులో బాలయ్యకి రైట్ హ్యాండ్ లా ఉండే రోల్ లో జగపతిబాబు కనిపిస్తాడట. సినిమాని కీలక మలుపు తిప్పే ఈ పాత్రలో జగపతిబాబు నటన మరో స్థాయిలో ఉంటుందని టాక్. త్వరలోనే 'BB3'లో జగపతిబాబు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |