![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి'తో బిజీగా ఉన్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ లోపే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నారు రవితేజ. 'నేను లోకల్' ఫేమ్ త్రినాథరావ్ నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ మాస్ ఎంటర్ టైనర్.. ఉగాదికి సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రవితేజకి జోడీగా ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారిలో ఒకరిగా 'పెళ్ళి సందడి' నయా వెర్షన్ లో నటిస్తున్న శ్రీలీల ఎంపిక కాగా, మరొకరిగా లవ్ లీ సింగ్ సెలెక్ట్ అయిందట. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'గాలి సంపత్'లో శ్రీవిష్ణుకి జోడీగా లవ్ లీ సింగ్ దర్శనమివ్వనుంది. త్వరలోనే రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ మూవీలో లవ్ లీ సింగ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఈ ఏడాది చివరలో ఈ మాస్ ఎంటర్ టైనర్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |