![]() |
![]() |

రేపు, ఫిబ్రవరి 19న నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో రెండు స్ట్రయిట్ సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు. ఐరనీ ఏమంటే.. రెండు తెలుగు సినిమాల కంటే రెండు డబ్బింగ్ సినిమాలపైనే డిస్ట్రిబ్యూటర్లు నమ్మకం ఉంచడం! అవును.. అల్లరి నరేశ్ హీరోగా నటించిన 'నాంది', సుమంత్ సినిమా 'కపటధారి'తో పాటు విశాల్ తమిళ డబ్బింగ్ ఫిల్మ్ 'విశాల్ చక్ర', యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కన్నడ డబ్బింగ్ సినిమా 'పొగరు' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
వీటిలో డిస్ట్రిబ్యూటర్లు మిగతా హీరోల కంటే విశాల్ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని సినిమా 'విశాల్ చక్ర'ని రూ. 5 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు, కన్నడ డబ్బింగ్ సినిమా 'పొగరు' మీద రూ. 3.75 కోట్లు పెట్టారు. ఎందుకంటే 'పొగరు'లో హీరోయిన్ ఎవరో కాదు, రష్మికా మందన్న!
ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే, నరేశ్ సినిమా 'నాంది'కి వాళ్లు పెట్టింది రూ. 2.5 కోట్లు మాత్రమే. సుమంత్ మూవీ 'కపటధారి'పై వారే మాత్రమూ ఆసక్తి చూపించలేదు. అందుకే దాని థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 1.75 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అల్లరి నరేశ్, సుమంత్ లాంటి పేరున్న హీరోలకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమంటున్నారు విశ్లేషకులు.
నిజానికి కామెడీ హీరోగా పేరున్న నరేశ్ 'నాంది'లో భిన్న పాత్రను చేశాడు. చేయని హత్యానేరంపై జైలుపాలయి, అండర్ ట్రయల్ ఖైదీగా నానా హింస ఎదుర్కొనే యువకుడిగా అతను కనిపించనున్నాడు. ఇక కన్నడంలో రూపొంది హిట్టయిన 'కవులుదారి'కి 'కపటధారి' రీమేక్.
![]() |
![]() |