![]() |
![]() |

ఈ వేసవిలో పలు చిత్రాలు వినోదాల విందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలకు సోలో రిలీజ్ డేట్స్ దక్కగా.. చాలామటుకు పోటీలోనే బరిలోకి దిగుతున్నాయి. అలా.. ఏప్రిల్ 30న కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాలే.. `విరాటపర్వం`, `పాగల్`.
దగ్గుబాటి స్టార్ రానా, సాయిపల్లవి జంటగా `నీదీ నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల రూపొందించిన పిరియడ్ రొమాంటిక్ డ్రామా `విరాటపర్వం`.. వేసవి కానుకగా ఏప్రిల్ 30న థియేటర్స్ లో సందడి చేయనుంది. కట్ చేస్తే.. అదే రోజు `ఈ నగరానికి ఏమైంది`, `ఫలక్ నుమా దాస్`, `హిట్` చిత్రాలతో యువతరానికి చేరువైన విశ్వక్ సేన్.. `పాగల్` అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో పలకరించబోతున్నాడు. మరి.. రానా వర్సెస్ విశ్వస్ సేన్ అన్నట్లుగా ఉన్న ఈ రసవత్తరమైన `రొమాంటిక్ డ్రామా` వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రానా హోమ్ బేనర్ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన `ఈ నగరానికి ఏమైంది`తోనూ.. సమర్పణలో రిలీజైన `ఫలక్ నుమా దాస్`తోనూ విశ్వక్ సేన్ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అదే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన `విరాటపర్వం` సినిమా రిలీజవుతున్న రోజే.. విశ్వక్ సేన్ `పాగల్` కూడా విడుదలవుతుండడం విశేషం.
`పాగల్`ని దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించగా.. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |