![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో నటిస్తున్న చిత్రం `గని`. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, టాలీవుడ్
స్టార్ జగపతిబాబు ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని జూలై 30న విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజుకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్`
ఫిక్సవడంతో.. విడుదల తేది విషయంలో `గని` యూనిట్ పునరాలోచన చేస్తోందట.
తాజా సమాచారం ప్రకారం.. వరుణ్ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా సెప్టెంబర్ 2న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. మరి.. ఈ వాయిదా
వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |