![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న `పుష్ప` చిత్రంతో.. పాన్ ఇండియా బాట పడుతోంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్ట్ 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఈ సినిమా విడుదలయ్యేలోపే.. మరో క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ రష్మికని వరించిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం రష్మికకి దక్కిందని టాక్. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబినేషన్ వెంచర్ లో రష్మిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, రష్మిక నటించిన కన్నడ చిత్రం `పొగరు` రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగులోనూ ఈ సినిమా అదే పేరుతో రిలీజ్ కానుంది.
![]() |
![]() |