![]() |
![]() |

ఒకే దర్శకుడితో వరుస సినిమాలు చేయడం.. కోలీవుడ్ స్టార్ అజిత్ శైలి. `వేదాళమ్`, `వివేగం`, `విశ్వాసమ్`.. ఇలా దర్శకుడు `శౌర్యం` శివతో మూడు వరుస చిత్రాలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు అజిత్. కట్ చేస్తే.. ఇప్పుడదే శైలిని `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ విషయంలోనూ కొనసాగించబోతున్నారని తమిళ చిత్ర వర్గాల సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. తన గత చిత్రం `నేర్కొండ పార్ వై` ( బాలీవుడ్ `పింక్`కి తమిళ వెర్షన్)ని హెచ్. వినోద్ కాంబినేషన్ లో చేసిన అజిత్.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `వలిమై`ని కూడా అదే దర్శకుడితో చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా పూర్తయ్యేలోపే వినోద్ డైరెక్షన్ లోనే మరో చిత్రానికి కమిటయ్యాడట అజిత్. అంతేకాదు.. `నేర్కొండ పార్ వై`, `వలిమై` చిత్రాలను నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నే అజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే అజిత్, వినోద్, బోనీ కపూర్ థర్డ్ జాయింట్ వెంచర్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |