![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ 15వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాతో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50 చిత్రాల మైలురాయికి చేరువ కావడం విశేషం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రానున్న చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నారని ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే.. చరణ్ - అనిరుధ్ కాంబోలో వచ్చే ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబో మూవీలో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ వంటి మల్టిస్టారర్స్ తో బిజీగా ఉన్నారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలసి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల కానుండగా.. యంగ్ టైగర్ యన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
![]() |
![]() |