![]() |
![]() |

ఈ సంక్రాంతికి 'రెడ్'తో సందడి చేశారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇందులో కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేసి అభిమానులను అలరించారు. 'రెడ్' తరువాత కోలీవుడ్ కెప్టెన్ ఆర్.టి. నేశన్ కాంబినేషన్ లో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ కాంబినేషన్ వార్తల్లో ఉండగనే.. మరో తమిళ దర్శకుడితో రామ్ జట్టుకట్టనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. లింగుస్వామి.
రన్, పందెం కోడి, ఆవారా.. ఇలా తమిళ అనువాదాలతో తెలుగువారికి చేరువైన లింగుస్వామి.. గత కొన్నాళ్ళుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎట్టకేలకు.. ఆ ప్రాజెక్ట్ సెట్ అయిందని.. రామ్ కాంబినేషన్ లో ఈ క్రేజీ వెంచర్ ఉంటుందని టాక్. అంతేకాదు.. ఇదో ఊర మాస్ కథతో తెరకెక్కనుందని అంటున్నారు. అలాగే ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారని సమాచారం. త్వరలోనే రామ్, లింగుస్వామి కాంబినేషన్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |