![]() |
![]() |

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న మూవీ 'చావు కబురు చల్లగా'. టాప్ టీవీ యాంకర్ అనసూయ ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ మాస్ బీట్స్‌తో సాగే ఈ సాంగ్‌లో అనసూయ చిందులు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతాయని చిత్ర బృందం తెలియజేసింది. ఈ పాటలో అనసూయ ఎలా కనిపిస్తారో చూపించే పిక్చర్స్‌ను విడుదల చేశారు. ఓ ఫొటోలో డప్పు కొడుతున్న అనసూయ, మరో ఫొటోలో మైక్ ముందు పాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సాంగ్‌ను త్వరలోనే యూ ట్యూబ్‌లో రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే బస్తీ బాలరాజుగా కార్తికేయ ఫస్ట్ లుక్, ఇంట్రోలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన క్యారెక్టర్ వీడియో, లావణ్యా త్రిపాఠి ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్స్, 'మై నేమ్ ఈజ్ రాజు' సాంగ్‌లకు సైతం అనూహ్య స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా కార్తికేయ గెటప్, డైలాగ్ మాడ్యులేషన్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మార్చి 19న 'చావు కబురు చల్లగా' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తుండగా, కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఆమని, మురళీ శర్మ కీలక పాత్రధారులు.
![]() |
![]() |