![]() |
![]() |

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఊర మాస్ కా బాప్ అన్నట్లుగా పుష్పలో బన్నీ క్యారెక్టర్ ఉంటుందని బజ్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. మరో హీరోయిన్ కూడా సందడి చేయనుందని టాక్. కాకపోతే అల్లు అర్జున్ కి జంటగా కాకుండా.. చెల్లెలిగా ఆమె కనిపిస్తుందట. ఇంతకీ ఎవరా భామ అంటే.. లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నితిన్ కి జోడీగా కనువిందు చేసిన మేఘా ఆకాశ్. కథను కీలక మలుపు తిప్పే సిస్టర్ రోల్ లో నటింపజేసేందుకు మేఘతో సుకుమార్ అండ్ టీమ్ చర్చలు జరిపిందని.. పాత్ర నచ్చడంతో మేఘ కూడా వెంటనే ఓకే చెప్పిందని వినికిడి. త్వరలోనే పుష్పలో మేఘా ఆకాశ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప.. ఆగస్టు 13న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |