![]() |
![]() |

నిన్నటి అందాల హీరోయిన్, నేటి శివగామి రమ్యకృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్‌గా అభిమానులు పిలుచుకొనే కృష్ణవంశీ ఏకైక తనయుడు రిత్విక్ కృష్ణ పదహారేళ్ల వయసు వాడయ్యాడు. ఈ రోజు అతని జన్మదినం. ఈ సందర్భంగా అతని అమ్మానాన్నలు ఇద్దరూ తనయుడితో కలిసి దిగి ఫొటోను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రమ్యకృష్ణ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా మూడు పిక్చర్స్‌ను షేర్ చేసి వాటికి, "My baby is 16....Happy Birthday #rithvickkrishna #familylove #13february" అంటూ క్యాప్షన్ జోడించారు. ఓ ఫొటోలో ఆమె రిత్విక్‌కు మమకారంగా ముద్దు పెడుతున్నారు. కృష్ణవంశీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పిక్చర్‌ను షేర్ చేసి, "GOD bless u nanna bangaaram ... Happy Birthday." అనే క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటోలో అమ్మానాన్నల మధ్య నిల్చొని, ఓ చెయ్యిని అమ్మ భుజం మీదా, ఇంకో చేతిని నాన్న భుజం మీదా వేసి, ఆనందంగా ఉన్నట్లు వేలు చూపిస్తున్నాడు రిత్విక్.

1998లో విడుదలైన 'చంద్రలేఖ' సినిమా సెట్స్‌పై రమ్యకృష్ణతో ప్రేమలో పడ్డారు కృష్ణవంశీ. ఆయన లవ్ ప్రపోజల్‌ను రమ్య కూడా అంగీకరించారు. కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన ఆ ఇద్దరూ 2003 జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 13న వారికి రిత్విక్ కృష్ణ పుట్టాడు.
![]() |
![]() |