![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్.. ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన క్రిష్ డైరెక్టోరియల్ తో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్నారు. అలాగే హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్స్ లోనూ సినిమాలు చేయబోతున్నారు.
వీటిలో హరీశ్ శంకర్ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. జూన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ వెల్లడించారు. పవన్ - హరీశ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కంటే ఎన్నో రెట్లు మిన్నగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని.. కేవలం ఎంటర్ టైన్ మెంట్ నే కాకుండా మెసేజ్ కూడా ఉంటుందని వారు తెలిపారు.
మరి.. గబ్బర్ సింగ్ రిలీజైన దాదాపు పదేళ్ళ తరువాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వారిద్దరి ఖాతాలో మరో మెమరబుల్ ఫిల్మ్ గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |