![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతి శెట్టి నాయికగా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. రేపు (శుక్రవారం) థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఉప్పెన రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 2 గంటల 27 నిమిషాల పాటు ఉప్పెన చిత్ర నిడివి ఉంటుందట. ఒకరకంగా ఇది సినిమాకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మరి.. భారీ అంచనాల మధ్య వేలంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ అవుతున్న ఉప్పెన.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |