![]() |
![]() |

మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. ప్రస్తుతం తన లక్కీ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. బీబీ3 తరువాత బోయపాటి.. మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ తో సినిమా చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముందని వినికిడి. అంతేకాదు.. పక్కా బోయపాటి మార్క్ తోనే ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే సాయితేజ్ - బోయపాటి ఫస్ట్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ వస్తుంది.
కాగా, మెగా కాంపౌండ్ లో ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రాలు చేశారు బోయపాటి. వీటిలో సరైనోడు బ్లాక్ బస్టర్ కాగా.. వినయ విధేయ రామ నిరాశపరిచింది. మరి.. సాయితేజ్ కాంబో మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |