![]() |
![]() |

మల్టిటాలెంటెడ్ సునీల్.. ప్రస్తుతం పుష్ప, ఎఫ్ 3 చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో రెండు వారాల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
మరోవైపు.. ఓటీటీ చిత్రాలతోనూ ముందుకు సాగుతున్నారాయన. రీసెంట్ గా వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో సునీల్ ఓ సినిమా చేశారు. సలోని నాయికగా నటించిన ఈ పేరు నిర్ణయించని చిత్రం త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది. అంతేకాదు.. ఓ నూతన దర్శకుడు కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ కి కూడా సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో సునీల్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపిస్తారని టాక్. అంతేకాదు.. ఈ సిరీస్ కూడా ఆహాలోనే స్ట్రీమ్ కానుందని బజ్. త్వరలోనే ఈ ఓటీటీ మూవీస్ కి సంబంధించి మరింత సమాచారం వెలువడే అవకాశముంది.
కాగా, గత ఏడాది డిస్కో రాజా, కలర్ ఫొటో చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో అలరించారు సునీల్. ఈ నేపథ్యంలో.. ఆ తరహా పాత్రలు మరిన్ని సునీల్ చెంతకు చేరుతున్నాయని వినికిడి.
![]() |
![]() |