![]() |
![]() |
.jpg)
అందం, అభినయం మెండుగా ఉన్న కథానాయికల్లో చెన్నై పొన్ను రెజీనా ఒకరు. కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, ఎవరు.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినా తెలుగునాట స్టార్ హోదా అయితే దక్కించుకోలేకపోయిందీ టాలెంటెడ్ యాక్ట్రస్. మరోవైపు మాతృభాష తమిళంలోనూ తనకీ ఇదే పరిస్థితి.
ఈ నేపథ్యంలో.. రెండు వారాల వ్యవధిలో రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన రెండు సినిమాలు తమిళనాట సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. చక్ర, నెంజం మరప్పదిల్లై. విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చక్రలో రెజీనా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో దర్శనమివ్వనుందని టాక్. ఫిబ్రవరి 19న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
ఇక చాన్నాళ్ళుగా విడుదలకు నోచుకోని రెజీనా హారర్ ఫిల్మ్ నెంజం మరప్పదిల్లై.. మార్చి 5న రిలీజ్ కాబోతోంది. ఈ తమిళ చిత్రంలో ఎస్.జె. సూర్య, నందితా శ్వేత ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
మరి.. రెజీనా ఆశలను ఈ రెండు సినిమాలు ఏ మేరకు నెరవెర్చుతాయో చూడాలి.
![]() |
![]() |