![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన టైటిల్ ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న అనౌన్స్ చేయనున్నారని టాక్. కథానాయకుల పాత్రలు కలిసొచ్చేలా ఆ టైటిల్ ని డిజైన్ చేశారని వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ఈ క్రేజీ వెంచర్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయిపల్లవి, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అలాగే ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ అతిథి పాత్రలో దర్శనమిస్తారని బజ్.
![]() |
![]() |