![]() |
![]() |

సింహా, లెజెండ్ వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. గత రెండు చిత్రాల తరహాలోనే ఇందులోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒక పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ రోల్ కాగా.. మరొకటి అఘోరా పాత్ర అని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఒక పాత్ర తాలూకు చిత్రీకరణనే జరుపుతూ వచ్చిన బోయపాటి అండ్ టీమ్.. నెక్స్ట్ షెడ్యూల్ లో బాలయ్య సెకండ్ గెటప్ కి సంబంధించిన సన్నివేశాలను పిక్చరైజ్ చేయనున్నారట. అఘోరా పాత్రకి సంబంధించిన ఈ పరిచయ సన్నివేశాలను కర్ణాటకలోని హోస్ పేట్ లో షూట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రస్తుతం అక్కడ లొకేషన్లని అన్వేషించే పనిలో యూనిట్ ఉందని టాక్. మరి.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో బాలయ్య ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తారో తెలియాలంటే మే 28 వరకు వేచిచూడాల్సిందే.
BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |