![]() |
![]() |

2016 సంక్రాంతికి విడుదలైన కింగ్ నాగార్జున సోషియో ఫాంటసీ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా.. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత అదే సీజన్ లో ఈ సినిమా సీక్వెల్ బంగార్రాజుని రిలీజ్ చేసే దిశగా ప్రణాళిక జరుగుతోందట.
సోగ్గాడే.. ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న బంగార్రాజుని.. తన తొలి చిత్రం విక్రమ్, అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీగా నిలిచిన మనం రిలీజైన మే 23న లాంఛనంగా ప్రారంభించి.. 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. నాగ్ తాజా చిత్రం వైల్డ్ డాగ్ ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మరోవైపు.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైన్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
మరి.. సోగ్గాడే చిన్ని నాయనా తరువాత సరైన విజయం లేని నాగ్ కి .. రాబోయే చిత్రాలతో మళ్ళీ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |