![]() |
![]() |

ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న కంటెంట్‌పై విమర్శలు, నిరసనలు చాలా కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మితిమించిన వయొలెన్స్, సెక్స్, డ్రగ్ యూజ్, క్రైమ్ సీన్లు ఓటీటీ కంటెంట్‌లో చాలా కామన్‌గా మారిపోయాయి. బూతు డైలాగులు సరేసరి. ఇది విలువల విధ్వంసానికి దారి తీస్తోందనీ, భారతీయ సంస్కృతిని ఈ కంటెంట్ నాశనం చేసేదిలా ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ నియంత్రణ కోడ్‌కు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్స్ సహా అన్ని ఇండియన్ ప్లాట్‌ఫామ్స్ అంగీకరించాయి.
త్వరలో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై అడల్ట్ కంటెంట్‌ను కంట్రోల్ చేసే సెల్ఫ్-రెగ్యులేషన్‌ను తీసుకు రానున్నది. దీని కోసం ఒక "ఇంప్లిమెంటేషన్ టూల్‌కిట్"ను ఇప్పటికే ఇంటర్నెట్ అంట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) ఫైనలైజ్ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై స్వీయ నియంత్రణతో కంటెంట్ తీసుకురావడానికి ప్రొడ్యూసర్స్‌కు హెల్ప్ అయ్యేలా ఓ కొత్త రూల్‌ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావడానికి సంబంధిత మంత్రిత్వశాఖలు సంప్రదింపులు ప్రారంభించాయి. ఈ కొత్త "ఇంప్లిమెంటేషన్ టూల్‌కిట్" ఎథిక్స్ కోడ్‌ను ఫాలో అవుతూ, స్వీయ నియంత్రణకు ఓ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశించనున్నది.
ఇటీవల 'మిర్జాపూర్', 'తాండవ్' లాంటి వెబ్ సిరీస్ కంటెంట్, వాటిలో ఉపయోగించిన భాషపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవి సెన్సిటివ్ కంటెంట్‌ను చూపిస్తూ, మత విశ్వాసాలను గాయపరుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్కువ శాతం కంటెంట్ అడల్ట్ ఓరియంటేషన్‌తో ఉంటున్నాయనీ, వీటిని పిల్లలు కూడా తిలకిస్తున్నారనీ మనకు తెలిసిందే. ఇప్పుడు తీసుకురానున్న టూల్‌కిట్‌లో కంప్లయింట్స్, అప్పీల్స్ సెక్షన్ కూడా ఉంటుందన్న మాట. అయితే సినిమాల తరహాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే కంటెంట్‌ను కంట్రోల్ చేసే సెన్సార్ బోర్డ్ లాగా మాత్రం కేంద్ర ఉండదని సమాచారం.
![]() |
![]() |