![]() |
![]() |

ఈరోజు హీరో సుమంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్‌కు 'అనగనగా ఒక రౌడీ' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ లోగోతో పాటు సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు రిలీజ్ చేశారు. మను యజ్ఞ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేశ్, డాక్టర్ టి.ఎస్. వినీత్ భట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వాల్తేరు శీను అనే రౌడీ క్యారెక్టర్‌ను సుమంత్ పోషిస్తున్నాడు. ఆ క్యారెక్టర్‌లో ఆయన చాలా భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. దగ్గరగా కట్ చేసిన జుట్టు, నుదుటిన చిన్న బొట్టు, పొడవుగా పెంచిన గడ్డానికి కలిసిపోయిన పొడవాటి మీసంతో ఆయన చాలా కొత్తగా ఉన్నాడు. గ్రీన్ కలర్ షర్టుపై నల్లటి లుంగీ పైకి కట్టి, నడుమ్మీద రెండు చేతులూ పెట్టుకొని తీక్షణంగా చూస్తున్నాడు సుమంత్. కుడి చేతికి కంకణం తొడిగి ఉన్నాడు.
డైరెక్టర్ మను యజ్ఞ మాట్లాడుతూ, "సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర చాలా భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరిస్తుంది. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది" అన్నారు.
ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ నిర్మాత: యెక్కంటి రాజశేఖర్ రెడ్డి, రచన-దర్శకత్వం: మను యజ్ఞ.

![]() |
![]() |