![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరు 8 సినిమాల కోసం జట్టుకట్టగా.. వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలా.. సక్సెస్ చూసిన చిత్రాల్లో 'సాహసవీరుడు - సాగరకన్య' ఒకటి. ఇందులో సాహసవీరుడుగా వెంకీ నటించగా.. సాగరకన్యగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి దర్శనమిచ్చారు. తెలుగులో తనకిదే తొలి చిత్రం కావడం విశేషం.
మరో నాయికగా మాలాశ్రీ అభినయించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, విజయలలిత, కోట శ్రీనివాసరావు, శ్రీహరి, బ్రహ్మానందం, బాబూ మోహన్, సుధాకర్, అలీ, రాళ్ళపల్లి, అనంత్, సుత్తివేలు, గుండు హనుమంతరావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
స్వరవాణి కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. "మీనా మీనా జలతారు మీనా" ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరగపల్లి శివరామకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఫాంటసీ మూవీ.. 1996 ఫిబ్రవరి 9న విడుదలై హిట్ మూవీగా రికార్డులకెక్కింది. నేటితో ఈ మ్యూజికల్ హిట్.. పాతికేళ్ళను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |