![]() |
![]() |

అప్పుడెప్పుడో స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఎంటర్ టైన్ చేసింది త్రిష. తెరపై చిరు, త్రిష జంట మెరుపులు పంచినా.. విమర్శకుల నుంచి మాత్రం పెదవి విరుపులు వచ్చాయి. కట్ చేస్తే.. దాదాపు పదిహేనేళ్ళ తరువాత మెగాస్టార్ ఆచార్యలో నటించే ఛాన్స్ దక్కించుకుంది త్రిష. అయితే, కొన్ని క్రియేటివ్ ఇష్యూస్ వల్ల షూటింగ్ లో పాల్గొనకముందే ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి తప్పుకుందీ చెన్నై పొన్ను. ఇంత జరిగినా.. త్రిషకి మెగాస్టార్ మరో ఆఫర్ ఇచ్చారట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సెన్సేషనల్ హిట్ లూసీఫర్ ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరుకి లవ్ ఇంట్రెస్ట్ గా త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని టాక్. పాత్ర నచ్చడంతో త్రిష కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొత్తానికి ఆచార్యని మిస్ అయిన మిస్ కృష్ణన్.. లూసీఫర్ రీమేక్ కి మాత్రం యస్ అందన్నమాట. త్వరలోనే లూసీఫర్ రీమేక్ లో త్రిష ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |