![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయంలో రూపొందుతున్న చిత్రం ఖిలాడి. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు.. గురువారం నుంచి ఖిలాడి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే తన పాత్రకు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు తెలపలేదు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తనది విలన్ రోల్ అని తెలిసింది. త్వరలోనే అర్జున్ చేస్తున్న రోల్ పై క్లారిటీ రావచ్చు.
కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఖిలాడి ఈ ఏడాది వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఖిలాడిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక రవితేజ బర్త్ డే కి రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
![]() |
![]() |