![]() |
![]() |

దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి గురువారం 30వ బర్త్‌డే వేడుకను సంబరంగా జరుపుకున్నారు. భార్య 20ల నుంచి 30లలోకి వస్తున్న తరుణంలో భర్త అర్చిత్ రెడ్డి గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి హన్షిత సరదాగా డాన్స్ కూడా చేశారు. వైట్ కలర్ గౌన్‌లో ఆమె అందంగా మెరిశారు.
.jpg)
ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వాటికి "Inside every 30 year old is an 18 year asking ‘ what happened ?’ #turning30 is fun" అనే క్యాప్షన్ పెట్టారు. అంతే కాదు, #milestonebirthday #30isthenew20 అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
.jpg)
.jpg)
.jpg)
మూడు రోజుల క్రితం తన ఫస్ట్ బర్త్‌డేకి సంబంధించిన పిక్చర్‌ను హన్షిత షేర్ చేశారు. అందులో తల్లిదండ్రులు అనిత, దిల్ రాజు కలిసి చిన్నారి హన్షు చేత కేక్ కట్ చేయిస్తున్నారు. ఆ పోస్ట్‌లో తను ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు హన్షు. దివంగతురాలైన తల్లిని గుర్తు చేసుకున్నారు. ఆమెను ఎంతగా మిస్ చేసుకున్నానో చెప్పడానికి మాటలు చాలవన్నారు. దేవుడు తన చిన్నారి కూతురు రూపంలో అమ్మను తిరిగి తన దగ్గరకు చేర్చాడని భావోద్వేగంతో చెప్పుకున్నారు. ఆ పాపలో నిన్ను చూసుకుంటున్నానని అమ్మకు చెప్పారు.
.jpg)
![]() |
![]() |