![]() |
![]() |

మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మాజీ హవల్దార్ మధ్య ఓ ఘటన కారణంగా మొదలైన ఘర్షణ, ఇగో సమస్యలతో ఎక్కడిదాకా వెళ్లిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పవన్ కల్యాణ్, మాజీ హవల్దార్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఒరిజినల్‌లో ఆ క్యారెక్టర్లను బిజూ మీనన్, పృథ్వీరాజ్ పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మాణమవుతోంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, సంభాషణలను త్రివిక్రమ్ రాస్తుండటం విశేషం.
ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి 25న అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. పవన్ కల్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలను ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా గురువారం రానా ఈ సెట్స్‌పై అడుగుపెట్టారు. పవన్‌తో పాటు రానా కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రానా లుక్‌ను నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. బ్లూ షర్ట్ ధరించిన రానా పొడవాటి గడ్డంతో మీసం మెలితిప్పుతూ కనిపిస్తున్నాడు. ఆ పిక్చర్‌తో పాటు, "The Handsome Hunk is here! The Mighty @RanaDaggubati joins the shoot of #ProductionNo12 Today!" అంటూ ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సముద్రకని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
![]() |
![]() |