![]() |
![]() |

ఈ వేసవి డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. రెండు వారాల గ్యాప్ లో తను కథానాయికగా నటించిన రెండు తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు పంచనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఫిదా తరువాత తన లక్కీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పల్లవి నటించిన సినిమా లవ్ స్టోరీ. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ సెన్సిబుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక అదే ఏప్రిల్ నెలలో 30న సాయిపల్లవి నాయికగా నటించిన మరో మూవీ రాబోతోంది. అదే.. విరాటపర్వం. దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించారు.
అలా.. రెండు వారాల గ్యాప్ లో సాయిపల్లవి నుంచి రెండు ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. మరి.. ఈ రెండు సినిమాలతో సాయిపల్లవి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం సాయిపల్లవి.. నాని హీరోగా రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో రానున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ కి జోడీగా తన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. చూస్తుంటే.. 2021 సాయిపల్లవి కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్ళే సంవత్సరంగానే కనిపిస్తోంది.
![]() |
![]() |