![]() |
![]() |

సూర్య హీరోగా నటించే 40వ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను ప్రియాంకా అరుళ్‌మోహన్ కొట్టేసింది. నాని సరసన 'గ్యాంగ్ లీడర్'లో నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రియాంక అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ తన బబ్లీ లుక్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు సూర్య హీరోగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించ తలపెట్టిన సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కింది.
ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ప్రియాంక పిక్చర్‌ను షేర్ చేసి, "@priyankaamohan will play the female lead in #Suriya40BySunPictures" అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమాను పాండిరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. డి. ఇమ్మాన్ మ్యూజిక్ ఇచ్చే ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
శర్వానంద్ సరసన ప్రియాంక నటించిన 'శ్రీకారం' చిత్రం మార్చి 11న మహాశివరాత్రి కానుకగా విడుదలవుతోంది. శివ కార్తికేయన్ జోడీగా 'డాక్టర్'లోనూ ఆమె నాయికగా ఎంపికయ్యింది. చూస్తుంటే, ఆమె కెరీర్ జెట్ స్పీడును అందుకుంటున్నట్లు కనిపిస్తోంది.
![]() |
![]() |