![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్ గా నిలిచి.. తెలుగు రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకర్షించాడు అభిజిత్. అంతేకాదు.. బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలను అందుకుంటున్నాడని సమాచారం. ఆ మధ్య విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టిస్టారర్ మూవీ ఎఫ్ 3లో అభి ఓ కీలక పాత్రలో ఎంపికయ్యాడని కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించే అవకాశం ఈ టాలెంటెడ్ యంగ్ స్టర్ కి దక్కిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లూసీఫర్ రీమేక్ లో.. ఓ యంగ్ సీఎమ్ రోల్ ఉంది. ఈ క్యారెక్టర్ కోసం సత్యదేవ్ నటించబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా పాత్రలో అభిజిత్ ఎంపికయ్యాడని టాక్. అదే గనుక నిజమైతే.. అభిజిత్ కి ఇదో సువర్ణావకాశమే. త్వరలోనే లూసీఫర్ రీమేక్ లో అభి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి చిరు ఆఫర్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానో దివిని వేదాళమ్ రీమేక్ లో ఓ పోలీసాఫీసర్ పాత్రకి ఎంచుకున్నట్లు ప్రకటించేశారు చిరు. అంతేకాదు.. సొహైల్ సినిమా చేస్తే అందులో చిన్న క్యారెక్టర్ అయినా చేస్తానన్నారు. అలాగే మెహబూబ్ కి కూడా తన సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు బజ్.
ఇక అభిజిత్ విషయానికి వస్తే.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మిర్చి లాంటి కుర్రాడు, రామ్ లీలా వంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |