![]() |
![]() |

ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాల్లో తమిళ అనువాద చిత్రం మాస్టర్ ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా ఖైదీ ఫేమ్ లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో టాలెంటెడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాడు. మాళవికా మోహనన్ నాయికగా నటించిన ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించాడు. భారీ అంచనాల మధ్య తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 13న మాస్టర్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. మాస్టర్ చిత్రంలో విజయ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడట. అంతేకాదు.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ షర్ట్ లెస్ లుక్ లోనూ దర్శనమిస్తాడని టాక్. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా విజయ్ ఇలా సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లెస్ తో మాస్ ని ఎంటర్ టైన్ చేయబోతున్నాడని.. సినిమాకి హైలైట్ గా నిలిచే సీన్స్ లో ఇదొకటని కోలీవుడ్ టాక్. మరి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |