![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు పవన్. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. కోవిడ్ ఎఫెక్ట్ తో తాతాల్కికంగా బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే తన రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసిన పవన్.. ఈ నెల 4 నుంచి క్రిష్ డైరెక్టోరియల్ తాలూకూ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ పార్ట్ జరుగుతుందట. ఆపై అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రీకరణలో పవన్ పాల్గొనబోతున్నారు. క్రిష్ మూవీ కంటే ముందు ఈ మలయాళ రీమేక్ తెరపైకి రానుందని సమాచారం.
![]() |
![]() |