![]() |
![]() |

మలయాళంలో స్టార్ హీరోగా రాణించిన జయరామ్.. తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనదైన ముద్రవేశారు. పలు అనువాద చిత్రాలతో ఇక్కడివారికి చేరువైన జయరామ్.. గత కొంతకాలంగా తెలుగులోనూ నేరుగా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ భాగమతిలో ప్రతినాయకుడిగా నటించిన జయరామ్.. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తండ్రిగా మారారు.
కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ వెటరన్ స్టార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పిరియడ్ రొమాంటిక్ సాగా రాధేశ్యామ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది వేసవిలో మల్టిలాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. మరి.. భాగమతి, అల వైకుంఠపురములో చిత్రాలతో తెలుగునాట రెండు వరుస విజయాలను అందుకున్న జయరామ్.. రాధేశ్యామ్ తో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |