![]() |
![]() |

2019లో 'విశ్వాసమ్', 'నేర్కొండ పార్వై' రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్. ప్రస్తుతం ఈ వెర్సటైల్ యాక్టర్.. 'వలిమై' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. 'నేర్కొండ పార్వై'ని డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా రూపొందిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. 'వలిమై'ని అజిత్ 50వ పుట్టిన రోజు (మే 1) కానుకగా రిలీజ్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ బజ్. బర్త్ డేకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 29ని రిలీజ్ డేట్ గా బోనీకపూర్ అండ్ టీమ్ ఫిక్స్ అయిందట. త్వరలోనే విడుదల తేదిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తున్న 'వలిమై'కి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. మరి.. 'వలిమై'తో అజిత్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |