![]() |
![]() |

నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఇదివరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఆడియోలో హీరో హీరోయిన్ల జంట ఎంతో అందంగా కనిపిస్తూ, ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాకుండా, ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. .‘వరుడు కావలెను' అనేపేరు చిత్ర కథకు పూర్తిగా సరైనదన్ననమ్మకాన్నివ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
కాగా 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చూడ ముచ్చటగా నాగశౌర్య , రీతువర్మ జంట కనిపిస్తోంది.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. చిత్ర నాయకా నాయికలతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తారాగణం:
నాగశౌర్య, రీతువర్మ నాయకా, నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష.
సాంకేతిక బృందం:
మాటలు: గణేష్ కుమార్ రావూరి
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
![]() |
![]() |