![]() |
![]() |

"నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేసుకుని వెళ్తుంటాను." అని చెప్పారు నాగచైతన్య. అనుభవం ఉన్న దర్శకులు అయితే తన నుంచి మరింత నటనను రాబట్టుకోగలరని ఆయన అభిప్రాయం. "కొత్త దర్శకులు అయితే నన్ను మరో టేక్ చేయమని చెప్పడానికి మోహమాట పడొచ్చు. అలా యాక్టింగ్ పరంగా నాకు తెలియకుండానే నేను రాజీపడాల్సి వస్తుందేమో." అని ఆయన సందేహపడ్డారు.
అందుకే కెరీర్‌లో రెండుమూడు మంచి హిట్స్ సాధించిన తర్వాత కొత్త దర్శకులతో సినిమాలు చేయాలని ఆయన అనుకుంటున్నారు. "కొత్త దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతకాలం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకునే నా ఆలోచన నాకొక బలహీనత కూడా కావొచ్చు." అని చెప్పారు చైతన్య. సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియా కామెంట్స్‌ని ఆయన పట్టించుకుంటారు. "కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చూస్తుంటాను. కానీ ఆ విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే లైఫ్ బాగుంటుంది’’ అన్నారాయన.
తన ప్రతి సినిమా గురించి భార్య సమంత నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెబుతుందని చైతన్య చెప్పారు. "నేనూ తన సినిమాలకు అంతే చెబుతాను." అని ఆయన తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'లవ్ స్టోరి' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి నటించింది.
![]() |
![]() |