![]() |
![]() |

ఈరోజు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ మూడో పెళ్లిరోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా, సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లికి సంబంధించిన ఒక అన్‌సీన్ పిక్చర్‌ను షేర్ చేశాడు విరాట్. ఆ పిక్చర్‌తో పాటు ఓ స్వీట్ యానివర్సరీ విష్ కూడా తన భార్యకు అతను అందజేశాడు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో వధువు వేషధారణలో ఉన్న అనుష్క తన ప్రియతముడైన విరాట్ వంక చూస్తూ బ్యూటిఫుల్‌గా నవ్వుతోంది. “3 years and onto a lifetime together” అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు విరాట్.
ఇటలీలో ఇదేరోజు మూడేళ్ల కిత్రం జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ సెర్మనీలో అనుష్క, విరాట్ కలిసి ఏడడుగులు నడిచారు. వారి పెళ్లి ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021 జనవరిలో తమ మొదటి బిడ్డను స్వాగతించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో అనుష్క పెగ్నెంట్ అయిన విషయాన్ని అందమైన పిక్చర్ ద్వారా వారు వెల్లడి చేశారు. ఆ ఫొటో ఇంటర్నెట్‌ను తుఫానులాగా చుట్టేసింది. ఆ ఫొటోలో గర్భం దాల్చిన తన పొట్టను చూపిస్తూ అనుష్క నిల్చుంటే, ఆమె పక్కనే సంతోషంగా కనిపించాడు విరాట్. ఆ ఫొటోను షేర్ చేసి, “And then, we were three! Arriving Jan 2021” అని వారు రాశారు.

![]() |
![]() |