![]() |
![]() |
.jpg)
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ముందు వరుసలో ఉంటాడు బాహుబలి ప్రభాస్. 41 సంవత్సరాల ఈ అందమైన ఆజానుబాహుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని చాలామంది ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. చాలామంది అమ్మాయిలు తమ కలల్లో ప్రభాస్‌ను తలచుకుంటూ, గుండెల్లో నింపుకున్నారు. వారికైతే ప్రభాస్ పెళ్లి వార్త గుండెలు బద్దలు చేసేదే. అయితే ఇంతదాకా ప్రభాస్ ఎప్పుడు, ఎవర్ని పెళ్లి చేసుకుంటాడనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉండిపోయింది. అలాంటి ప్రభాస్ టీనేజ్‌లో ప్రేమలో పడ్డాడనే విషయం తెలుసా? అదీ అప్పటి ఓ స్టార్ హీరోయిన్‌తో!
అవును. ఆమె ఎవరో కాదు.. 'మొహ్రా' సినిమాలో "టిప్ టిప్ బర్సా పానీ" అనే రెయిన్ సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన రవీనా టాండన్. ఆ రెయిన్ సాంగ్‌లో రవీనా అందాలు చూడటానికి రెండు కళ్లూ చాల్లేదు ప్రేక్షకులకు. అలాంటి పాటే తెలుగు సినిమాలోనూ చేసింది రవీనా. అది.. 'బంగారు బుల్లోడు'లో బాలకృష్ణతో చేసిన "స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.." పాట. అయితే ప్రభాస్ మనసులో రవీనా అలజడి రేపింది ఈ పాటలతో కాదు.. 'అందాజ్ అప్నా అప్నా' సినిమాలోని "ఏలో జీ సనమ్ హమ్ ఆగయే" అనే పాట. ఆ పాటలో రవీనాను చూసి మనసు పారేసుకున్నాడు ప్రభాస్. అంటే అతని ఫస్ట్ క్రష్ రవీనా! ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా కొంత కాలం క్రితం తెలిపాడు.
ప్రభాస్ ప్రస్తుతం పూజా హెగ్డేతో తొలిసారి కలిసి నటిస్తూ 'రాధే శ్యామ్' అనే పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'సలార్' మూవీ చేయనున్నాడు.
![]() |
![]() |