![]() |
![]() |

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్. కాస్ట్యూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టిస్టారర్ మూవీలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలసి మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ మూవీ తాలూకు చిత్రీకరణ.. లాక్ డౌన్ తో నిలిచిపోయింది.
దాదాపు తొమ్మిది నెలల తరువాత జనవరి నుంచి చిత్రీకరణని పునః ప్రారంభించేందుకు మణితర్నం అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. తొలుత పొల్లాచ్చి, అనంతం మైసూర్ లో పొన్నియన్ సెల్వన్ తాలూకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుగుతాయని కోలీవుడ్ ఇన్ ఫర్మేషన్. రెండు భాగాలుగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో మణిరత్నం ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. కాగా, ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తారని వినికిడి.
![]() |
![]() |