![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ అనుష్కది బ్లాక్ బస్టర్ జోడీ. బిల్లా (2009), మిర్చి (2013), బాహుబలి - ది కంక్లూజన్ (2017) చిత్రాల్లో ఈ ఇద్దరి జంట చూపరులకు కనుల పంటగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురిపించింది. అలాంటి ఈ సిల్వర్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచదర్ పెయిర్.. త్వరలో మరోసారి జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పేరుతో ప్రభాస్ ఓ యాక్షన్ సాగా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హోంబళే ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులోనే ప్రభాస్ కి జోడీగా అనుష్క నటించబోతున్నారని టాక్. తన ఇమేజ్ కి తగ్గట్టుగా పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర ఇదని.. అందుకే స్వీటీ కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారని వినికిడి. త్వరలోనే సలార్ లో స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఇటీవలే నిశ్శబ్దంతో ఓటీటీ వేదికగా సందడి చేశారు అనుష్క. ఇందులో మూగ, చెవిటి మహిళ పాత్రలో స్వీటీ దర్శనమిచ్చారు. ఆ సినిమా తరువాత మరే చిత్రానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే.. సలార్ లో స్వీటీ నటించబోతున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది.
![]() |
![]() |