![]() |
![]() |

వర్షం, డార్లింగ్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ పిరియడ్ రొమాంటిక్ సాగా.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మైనే ఫ్యారే కియా ఫేమ్ భాగ్యశ్రీ.. ప్రభాస్ కి తల్లి పాత్రలో దర్శనమివ్వనున్నారు. పునర్జన్మల నేపథ్యంలో రాధేశ్యామ్ తెరకెక్కుతోందని.. ఇందులో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ లో ఒకే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇదో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అని.. ఛాయాగ్రహకుడు మనోజ్ పరమహంస ఈ పోరాట ఘట్టాన్నిఅత్యున్నత సాంకేతికతతో చిత్రీకరిస్తున్నారని టాక్. మరి.. సిల్వర్ స్క్రీన్ పై ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే 2021 వేసవి వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |