![]() |
![]() |

'లెజెండ్' సినిమాతో కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా పేరు పొందిన జగపతి బాబును ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు మరో కథానాయకుడు రాజశేఖర్ ను ఆయన విలన్ చేస్తున్నారా? అంటే చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి వినపడుతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత హీరో, దర్శకుడి కాంబినేషన్లో సినిమా కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కూడా అంచనాలకు తగ్గట్టే ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రను రాజశేఖర్ తో చేయించాలని బోయపాటి శ్రీను అనుకుంటున్నారట.
ఇటీవలే కరోనా నుండి రాజశేఖర్ కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాత కథ, అందులో పాత్ర వివరించి ఒప్పించే ప్రయత్నం చేయాలని బోయపాటి అనుకుంటున్నారట.
![]() |
![]() |