![]() |
![]() |

కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ ఇంకా ఇండియా రాలేదు. కొన్ని రోజుల క్రితం గౌతమ్ కిచ్లూ, కాజల్ దంపతులు హనీమూన్ ట్రిప్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలిద్దరూ ఇప్పుడు మాల్దీవుల్లోనే ఉన్నారు. అక్కడి నుండి రాలేదు. దీపావళి కూడా బీచ్ సైడ్ రిసార్టులో సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా వాళ్ళిద్దరూ జలకాలాటలలో మునిగితేలారు.
.jpg)
సముద్రపు నీటిలో జలకాలాటలలో ఆడుతున్న సమయంలో దిగిన ఫోటోలను కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దంపతులిద్దరూ కలిసి స్కూబా డైవింగ్ చేశారన్న మాట. "నాకు సముద్రమంటే ఎంతో ఇష్టం. ఆ నీలిరంగు అందులో ప్రశాంతత ఇష్టమే. అయితే... భయమూ ఉంది. సముద్రంలో ఒంటరిగా ఉండండి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి" అని కాజల్ పేర్కొన్నారు.
.jpg)
అన్నట్టు కాజల్ హనీమూన్ ఖర్చు గురించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన రిసార్ట్ లను గౌతమ్ బుక్ చేశారట.
.jpg)
![]() |
![]() |