![]() |
![]() |

కొద్ది రోజుల క్రితం మహేశ్ ఫ్యామిలీ సెలవులు జాలీగా గడిపేందుకు దుబాయ్ వెళ్లింది. అక్కడ సముద్రం పక్కనే ఉన్న ఓ విలాసవంతమైన హోటల్‌లో బస చేసింది. అక్కడ నుంచి మహేశ్, ఆయన భార్య నమ్రత ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తూ వస్తున్నారు. అక్కడ వారితో మరో ఫ్యామిలీ కూడా కలిసింది. అది.. నమ్రత అక్కయ్య శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ. శిల్ప, ఆమె భర్త అప్రేష్ రంజిత్, కూతురు అనౌష్క తమను కలవడంతో నమ్రత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనౌష్కతో నమ్రత పిల్లలు గౌతమ్, సితార బోలెడు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశారు.
.jpg)
చాలా రోజుల తర్వాత తమ ఫ్యామిలీలు రెండు పూర్తి స్థాయిలో కలవడంతో అక్కాచెల్లెళ్లు శిల్ప, నమ్రత ఈ కాలాన్నంతా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ గడిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా అక్కడి నుంచే విషెస్ చెప్తూ, కొన్ని పిక్చర్లు, వీడియో క్లిప్‌లను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు. సోమవారం రెండు కుటుంబాలు కలిసి తాము డిన్నర్ చేసిన హోటల్ దగ్గర దిగిన ఫొటోను నమ్రత షేర్ చేశారు. అందులో గౌతమ్ చాలా హైట్ అయిపోయి, దాదాపు ఫాదర్ మహేశ్ హైట్‌ను అందుకునేట్లు కనిపిస్తున్నాడు.
ఈ ఫొటోకు "About last night.. A rare sight! No masks on (just for the picture) Diwali special. Dining out!! Nothing better than family outings and festivities! These times treasured" అని రాసుకొచ్చారు నమ్రత.
(1).jpg)
కామెంట్ సెక్షన్‌లో శిల్పా శిరోద్కర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "Couldnt have asked for anything better this Diwali" అంటూ కామెంట్ చేశారు. అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని ఈ ఇద్దరూ నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నారు కదూ!
.jpg)
![]() |
![]() |