![]() |
![]() |

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది. అయితేనేం.. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెక్'లో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో నాయికగా నటించే అవకాశాన్ని పట్టేసింది ఈ సొగసరి. అంతేకాదు.. మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ లోనూ ప్రియ నటించబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో విజయం సాధించిన 'ఇష్క్' సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. తేజ సజ్జా కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం నాగరాజు దర్శకత్వంలో రూపొందనుంది. ఇందులోనే నాయికగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందట ప్రియ. త్వరలోనే ఈ రీమేక్ లో ప్రియ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. 'చెక్'తో పాటు 'ఇష్క్' రీమేక్ తోనైనా ప్రియా ప్రకాష్ వారియర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |