![]() |
![]() |

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకోనే నటనా రంగంలోకి అడుగుపెట్టి పదమూడేళ్లయ్యింది. ఆమె తొలిసారి హీరోయిన్గా నటించిన 'ఓం శాంతి ఓం' మూవీ 2007 నవంబర్ 10న విడుదలైంది. ఆ మూవీలో ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జోడీగా నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీలో ఆమె పోషించిన పాత్ర పేరు శాంతిప్రియ. అందుకే తన తొలిపాత్రను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా అకౌంట్లను ఆ పేరుతో మార్చేసింది దీపిక. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు 'శాంతిప్రియ' అనే పేరు పెట్టిన ఆమె డిస్ప్లే ఫొటోగా షారుఖ్, తను కలిసున్న 'ఓం శాంతి ఓం' ఫొటోను పెట్టింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ స్పెషల్ డే సందర్భంగా దీపిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెను అభినందనల వర్షంలో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు సోమవారం అర్ధరాత్రి నుంచే హడావిడి చేస్తూ, ఈ ప్రత్యేకమైన రోజును కామన్ డిస్ప్లే పిక్చర్తో సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్గా వెండితెరపై కాలుపెట్టిన నాటినుంచే పికు, మస్తానీ, రాణీ పద్మావతి, మీనమ్మ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. గడచిన పదమూడేళ్లుగా నటిగా ఆమె చాలా ఎదిగిందనేది నిస్సందేహం. తను ఈ స్థాయికి రావడానికి పునాదిగా నిలిచిన 'ఓం శాంతి ఓం'ను తగిన రీతిగా గౌరవించింది దీపిక. రానున్న రోజుల్లో ఆమె టాలీవుడ్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు, ప్రభాస్ జోడీగా నటించేందుకు రెడీ అవుతోంది.

![]() |
![]() |