![]() |
![]() |

'బాహుబలి' సిరీస్ తో 'యంగ్ రెబల్ స్టార్' ప్రభాస్ కాస్త 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అయిపోయారు. 'బాహుబలి - ది బిగినింగ్'తో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన డార్లింగ్ స్టార్.. 'బాహుబలి - ది కంక్లూజన్'తో ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తరువాత వచ్చిన 'సాహో' ఇక్కడివారిని నిరాశపరిచినా.. హిందీ బాబుల జేబులు కొల్లగొట్టేసింది. రైట్ నౌ ప్రభాస్ చేతిలో రాధే శ్యామ్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ ఉన్నాయి. వీటిలో 'రాధే శ్యామ్' చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. మిగిలిన రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ లో ఒకే మూస సినిమాలు రాకుండా డిఫరెంట్ జానర్స్ పై దృష్టి సారించారు ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ ఫోక్‌లోర్ జానర్ లో తెరకెక్కగా.. 'సాహో' స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇక 'రాధే శ్యామ్' పిరియడ్ లవ్ స్టోరీ. 'ఆది పురుష్' విషయానికి వస్తే.. మైథలాజికల్ డ్రామా. అలాగే నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్. మొత్తమ్మీద.. డిఫరెంట్ జానర్స్ స్ట్రాటజీతో ప్రభాస్ ఆల్ క్లాస్ ఆడియన్స్ ని ఫిదా చేయబోతున్నారన్నమాట.
![]() |
![]() |