![]() |
![]() |

బాహుబలి ప్రభాస్ సరసన అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ రోజు (అక్టోబర్ 13న) పూజా హెగ్డే పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర బృందం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
యూరప్ నేపథ్యంలోని 19వ శతాబ్దపు నేపథ్యంలో చారిత్రక ప్రేమకథతో 'రాధే శ్యామ్' చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రేరణగా పూజా హెగ్డే లుక్ ఆనాటి అమ్మాయిని తలపించింది. ముఖ్యంగా ఆమె నవ్వు చాలా అందంగా ఉంది. అప్పట్లో యూరప్ లో ట్రైన్ లు ఏవిధంగా ఉండేదో అదేవిధంగా పూజా హెగ్డే బ్యాక్ గ్రౌండ్ ఉంది. ట్రైన్ నేపథ్యంలో మంచి సన్నివేశాలు ఉన్నాయని ఊహించవచ్చు.

బాహుబలితో పాటు ఆ చిత్రానికి ముందు, ఆ తర్వాత ప్రభాస్ యాక్షన్ చిత్రాలే చేశారు. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే తమ హీరో నుండి మంచి ప్రేమ కథ వస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. వాళ్లకు ఈ సినిమా పర్ఫెక్ట్ ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.
![]() |
![]() |