![]() |
![]() |

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట తర్వాత మరో క్రికెటర్, బాలీవుడ్ నటి జంట త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నారు. ఆ జంట.. భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరిక ఘట్కే. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు సౌదీ అరేబియాలో ఉన్న ఆ బ్యూటిఫుల్ కపుల్ తొలి బిడ్డను కనేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి పిక్చర్‌లో జహీర్ పక్కన లూజ్ బ్లాక్ డ్రస్ ధరించిన సాగరికను చూస్తే.. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం అర్థమవుతోంది. నిజానికి, వారు ఆ విషయం బహిర్గతం చేయకపోయినప్పటికీ, వారి ఫ్రెండ్స్ ఆ విషయం ధ్రువీకరించారు.
జహీర్, సాగరిక 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ప్రపోజల్ గురించి ఒకసారి సాగరిక మాట్లాడుతూ, "ఐపీఎల్ సీజన్ మధ్యలో జహీర్ నుంచి ఈ ప్రపోజల్ రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌ల మధ్య రెండు రోజుల విరామం లభించడంతో ఇద్దరం గోవా వెళ్లాం. అలా మా ఎంగేజ్‌మెంట్ జరిగింది" అని తెలిపింది.
![]() |
![]() |