![]() |
![]() |

టీవీ సీరియల్స్‌లో హీరోగా చేస్తున్న సొహేల్ పరిస్థితి ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో దయనీయంగా ఉండేట్లు కనిపిస్తోంది. ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ ఈ వారమంతా గిన్నెలు కడగాలని జోర్దార్ సుజాత వేసిన బిగ్ బాంగ్‌తో సొహేల్ డంగైపోయాడు. సింక్ లోని పాత్రలన్నీ కడుగుతూ, "కెప్టెన్ అయ్యాను కాలు మీద కాలు వేసుకొని కూసుందాం అనుకున్నా.. నా లైఫ్ లో అనుకోలే ఇలా గిన్నెలు తోముతానని" అంటూ బాధపడ్డాడు. "గిన్నెలు కడుగుతా కానీ పర్సనల్ గా తాగే కప్పులు మాత్రం కడగను" అన్నాడు. టీ, కాఫీలు తాగి కడగకుండా పెడుతున్నారనీ, వాటిని దాచిపెడతానననీ సొహేల్ అన్నాడు. "అలా చేస్తే గొడవలు అవుతాయి.. వద్దు" అంటూ అమ్మ రాజశేఖర్ వారించాడు. "ఇంటిలో ఇప్పటి వరకు క్లీనింగ్ లో ప్రాబ్లెం రాలేదు. ఇప్పుడు నువ్వే క్రియేట్ చేస్తున్నావు" అంటూ సొహేల్ ను విమర్శించాడు. దాంతో ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడంటూ బిగ్గరగా అరిచాడు సొహేల్. దాంతో సరే నేను కడిగేస్తానని మాస్టర్ అన్నాడు.
ఎవరు తాగిన కప్పులు వారే కడగాలన్న గొడవ కొనసాగుతునే ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన అరియానా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే సొహేల్ ఆమె చెప్పేది వినకుండా మెహబూబ్ తో మాట్లాడటంతో అరియానా ఇగో హర్ట్ అయ్యింది. "కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరు" అంటూ సొహేల్ ను విమర్శించింది. "ఏందీ?" అంటూ ఫైర్ కాబోయిన సొహేల్ తన కోపాన్ని బిగ్‌బాస్‌కు ఇచ్చిన ప్రామిస్ కారణంగా తగ్గించుకున్నాడు. ఆ తర్వాత కెమెరా ముందు అరియానాపై కంప్లైంట్ ఇచ్చాడు. అరియానా కూడా మరో కెమెరా ముందు "ఇంటిసభ్యులు చెప్పింది కెప్టెన్ పట్టించుకోవడం లేదు" అంటూ ఫిర్యాదు చేసింది. కప్పులపై, పాత్రలపై పేర్లు రాసుకుందాం.. ఇకపై ఎవరి పాత్రను వాళ్లే వాడుకుందాం.. అంటూ అందరూ నిర్ణయానికి వచ్చారు.
![]() |
![]() |